చిరంజీవి అంకుల్ ను మెగాస్టార్ అనేది అందుకే: మంచు లక్ష్మి

  • ప్రకంపనలు సృష్టిస్తున్న సైరా టీజర్
  • ట్విట్టర్ లో స్పందించిన మంచు ఫ్యామిలీ
  • తరగని ఎనర్జీతో రెచ్చిపోయారని వ్యాఖ్యానించిన మంచు లక్ష్మి
  • సినిమా చూసేందుకు ఆగలేకపోతున్నానంటూ మంచు మనోజ్ స్పందన
చిరంజీవి ప్రధానపాత్ర పోషించిన సైరా నరసింహారెడ్డి టీజర్ ఇవాళ రిలీజైంది. ఈ టీజర్ చూసిన ప్రముఖులు స్పందించకుండా ఉండలేకపోతున్నారు. టాలీవుడ్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు మంచు లక్ష్మి కూడా సైరా టీజర్ పై రెస్పాండ్ అయ్యారు. ఎన్నటికీ తరగని ఎనర్జీతో మీరలా రెచ్చిపోతుంటే మతి పోయింది చిరంజీవి అంకుల్. మిమ్మల్నందరూ మెగాస్టార్ అనేది అందుకేనని అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా, సైరా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ కు శుభాభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు మరింత నాణ్యతను అందిస్తున్నందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు.

మంచు లక్ష్మి సోదరుడు, యువ హీరో మంచు మనోజ్ కూడా సైరా టీజర్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మిత్రమా రామ్ చరణ్, నీ ప్రొడక్షన్ విలువలు అదుర్స్ అంటూ ట్వీట్ చేశారు. మిమ్మల్ని ఓ యోధుడిగా తెరపై చూసేందుకు ఆగలేకపోతున్నానంటూ మనోజ్ తన స్పందన తెలియజేశారు.
Go Back to Shorts
Chiranjeevi
Manchu Lakshmi
Syeraa

More Telugu News